నేపాల్ ఆప‌ద్ధ‌ర్మ ప్ర‌ధాని కేపీ శ‌ర్మ ఓలీ రాజీనామా

కాఠ్మాండు: నేపాల్ ఆప‌ద్ధ‌ర్మ‌ ప్ర‌ధాని కేపీ శ‌ర్మ ఓలీ రాజీనామా చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల‌కు త‌మ పార్టీ క‌ట్టుబ‌డి ఉంద‌ని ఆయ‌న అన్నారు. నేపాల్‌ సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పును వెలువరించిన విష‌యం తెలిసిందే. నేపాల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత షేర్‌ బహుదూర్‌ దేవుబాను మంగళవారంలోపు ప్రధానిగా నియమించాలని దేశాధ్యక్షురాలు బిద్యా దేవి భండారీకి కోర్టు సూచించింది. గతంలో రద్దు చేసిన పార్లమెంటును పునరుద్ధరించాలని ఆదేశించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/