నీతి కథ : చివరికి మిగిలేది

/neeti kadha

ఒక ఊరిలోకి గంగడు అనే గజదొంగ అనుచరులతో వచ్చాడు. ఓ పెద్ద ఇంట్లోకి అర్ధరాత్రి ప్రవేశించాడు. ఆ ఇల్లు ఖాళీగా ఉంది. ఆ ఇంట్లో మనుషులూ లేరు. వస్తువ్ఞలూ లేవ్ఞ. ఒక ఇంట్లో దొంగతనానికి ప్రవేశించినపుడు ఏదో వస్తువ్ఞ పట్టుకెళ్లడం వృత్తిధర్మం. అందుకని ఏదో వస్తువ్ఞ దొరకపోతుందా అన్న ఆశతో గదులన్నీ వెతుకుతేంటే ఓ గదిలో మంచం మీద ముసలతను కనిపించాడు. గంగడు ఆ ముసలతన్ని చూస్తూ ఓ ముసలివాడా లే అని గద్దించాడు. ఆ ముసలివాడు లేచాడు. ఎవరు నాయనా నువ్ఞ్వ? అని అడిగాడు.
గంగడు నిర్లక్ష్యంగా నవ్ఞ్వతూ గజదొంగ గంగడిని అన్నాడు. ముసలివ్యక్తి నువ్వతూ నీకు దొంగతనం చెయ్యడానకి నా ఇల్లే దొరికిందా నాయనా అన్నాడు.

తను గంగడు అని చెప్పినా ఏం భయపడకుండా తనతో పరిహాసమాడటం ఆశ్చర్యమేసి ఏం ఒళ్లు పొగరుగా ఉందా?అంటూ గద్దించాడు. నీకు రంగడు తెలుసా నాయనా? అడిగాడు ముసలివ్యక్తిని నిదానంగా రంగడు అతి పెద్ద
గజదొంగ రంగడికి అతనంటే ఆరాధ్యదైవం. అంతటి పెద్ద గజదొంగ అనిపించుకోవాలన్నదే అతని ఆశయం. రంగడికి గంగడు ఏకలవ్య శిష్యుడు. ఆ ముసలివ్యక్తి తన గురువ్ఞను ఏకవచనంతో పిలవడం గంగడికి మరింత కోపం వచ్చి ఇంత పెద్ద ఇంట్లో ఏమీ లేకుండా జీవిస్తూ నా గురువ్ఞనే అవమానిస్తావా? అని గద్దించాడు. రంగడు నీకు గురువా? అన్నాడు

ముసలి వ్యక్తి ఆశ్చరంగా. అదిగో మళ్లీ రంగడు అంటున్నావ్ఞ అన్నాడు కోపంగా. ముసలి వ్యక్తి నవ్ఞ్వతూ నన్ను నేను ఎలా గౌరవించుకోమంటావ్ఞ నాయనా! నువ్ఞ్వ నన్ను ఎప్పుడూ చూడలేదు. నేను రంగడిని. గంగడు నిర్ఘాంతపోయాడు. తను దైవంగా భావించిన రంగడి దైన్యస్థితికి అతని కళ్లమ్మట నీళ్లు తిరిగాయి. రంగడి పాదాల మీద పడి మీకు ఈ పరిస్థితి ఎలా వచ్చిందని అడిగాడు. చేసిన పాపాల ఫలితం నాయనా గజదొంగగా అనుచరుల కోసం దొంగతనాలు చేసి ఎందరి ఉసురుపోసుకున్నాను. నేను కళ్లోకి వస్తేనే ప్రజలు హడలిపోయేవారు.

శరీరంలో శక్తిపోయింది. నా అనుచరులే నన్ను నిలువ్ఞదోపిడీ చేశారు. నా అన్నవారు లేక అలమటిస్తున్నాను. పశ్చాత్తాపంతో బాధపడుతున్నాను. నువ్ఞ్వ నన్ను ఆదర్శంగా పెట్టుకుని గజదొంగగా మారావ్ఞ అని అర్ధమైంది. రేపు నీ పరిస్థితి అదే అవ్ఞతుంది. అందువల్ల ఇక నుంచి అయినా మంచి దారిలో నడు అన్నాడు. గంగడికి జ్ఞానోదయం కలిగి దొంగతనాలకు స్వస్తి చెప్పి, మంచి మార్గంలోకి మారి ఆ వృద్ధాప్యంలో రంగడికి అండగా నిలిచాడు. చివరకు మిగిలేది మంచేనని గురుశిష్యులకు అర్ధమైంది.

  • ఉలాపు బాలకేశవులు, గిద్దలూరు

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/