తెలుసుకోండి ..తమాషా చెత్తబుట్టలు

Dust bin

మనం పారేసే రకరకాల చెత్త భూమిపై పెద్ద వ్యవహారంగా మారింది. చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయడం మరిన్ని సమస్యలకు కారణమవ్ఞతోంది. ఇలా ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా వివిధ ప్రాంతాలకు చెందిన ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు రకరకాల చర్యలను తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా తాజాగా ఫిన్‌లాండ్‌ రాజధాని మెల్సింకోలో అక్కడి స్థానిక ప్రభుత్వం వారు ఓ కొత్త తరహా చెత్తబుట్టలను తమ నగరంలో ప్రవేశపెట్టారు.

ఈ చెత్తబుట్టల ప్రత్యేకత ఏమిటంటే.. ఎవరైనా వీటి మూత తెరిచి వీటిలో చెత్తను వేయగానే ఇవి థాంక్యూ అంటాయి. అది కూడా మామూలు వ్యక్తుల గొంతు తో కాదు. ఏ ప్రముఖ వ్యక్తుల గొంతుతోనో, ప్రజలు అమితంగా ఇష్టపడే వ్యక్తుల గొంతుతోనో మధురంగా థాంక్స్‌ చెబుతాయి. అంతే కాదు. తమను మొత్తం ఎన్నిసార్లు ఉపయోగించారు అన్న విషయాన్ని కూడా అవి లెక్కపెట్టుకుం టాయి.

మాట్లాడే ఈ చెత్త బుట్టల లోపల అలాంటి డిటెక్లర్లని, చిప్స్‌ని ఏర్పాటు చేస్తారు. ఐరోపా దేశాల్లో ఇప్పటికే బాగా వాడుకలో ఉన్న ఈ చెత్త బుట్టలు.. చెత్తను పారేసే విషయంలో పిల్లలకు క్రమశిక్షణను నేర్పించేందుకు బాగా తోడ్పడు తున్నాయని అంటున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/