NBK107 ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ : ఊర మాస్ లో బాలకృష్ణ

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 100వ జయంతిని పురస్కరించుకుని నందమూరి బాలకృష్ణ తన 107 సినిమా తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి అభిమానులను ఆకట్టుకున్నారు. అఖండ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలకృష్ణ..ప్రస్తుతం క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తన 107 వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ ఎన్టీఆర్ 100 వ జయంతి సందర్బంగా రిలీజ్ చేసారు.

ఈ పోస్టర్ లో బాలకృష్ణ ఊర మాస్ గెటప్ లో అదరగొట్టాడు. వైట్ అండ్ వైట్ దుస్తుల్లో ఉన్న బాలయ్య.. తన చేతిలో రక్తంతో తడిసిన ఒక పెద్ద కత్తిని పట్టుకుని నిలబడి ఉన్నారు. లైట్ గా గడ్డం మరియు మీసాలతో బాలకృష్ణ ఇక్కడ యంగ్ మరియు డాషింగ్ గా కనిపిస్తున్నారు. బ్యాగ్రౌండ్ లో ఒక టెంపుల్ మరియు జనాల గుంపును మనం గమనించవచ్చు. ఇక ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా , కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ గా నటిస్తున్నాడు. కోలీవుడ్ విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ , ప్రముఖ మలయాళ నటుడు లాల్ , నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. చంద్రిక రవి స్పెషల్ నంబర్ లో ఆడిపాడనుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.