లడఖ్ ప్రమాదం.. బాధితులకు అన్ని విధాలా సాయం చేస్తాం: ప్ర‌ధాని

న్యూఢిల్లీ : నిన్న ల‌ద్దాఖ్‌లోని ష్యోక్ న‌దిలో జ‌వాన్లు ప్ర‌యాణిస్తున్న ఆర్మీ వాహ‌నం అదుపు త‌ప్పి ప‌డిపోయింది. ఈప్రమాదంలో ఏడుగురు మంది జ‌వాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంపై ప్రధాని మోడీ ట్వీట్ చేస్తూ.. ‘లడఖ్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో వీర సైనికులను కోల్పోయినందుకు చాలా బాధపడుతున్నాను. మృతుల కుటుంబాలకు నా సానుభూతి. గాయపడిన సైనికులు ఉంటారని ఆశిస్తున్నాను. వారు వీలైనంత త్వరగా కోలుకోవాల‌ని ఆశిస్తున్నాను. బాధితుల‌కు అన్ని విధాలా సహాయం అంద‌జేస్తాంమ‌ని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/