ది మెగాలియోను ఆవిష్కరించిన నవనామి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్

Navnami Projects Pvt Ltd has unveiled The Megaleo

హైదరాబాద్ : హైదరాబాద్ యొక్క సరికొత్త ల్యాండ్‌మార్క్ మరియు విలాసవంతమైన జీవనానికి గమ్యం 4.1 ఎకరాలలో విస్తరించి ఉన్న మెగాలియో (Megaleio) ప్రకృతి ఒడిలో ఉంటుంది, దీని చుట్టూ 1200 ఎకరాల పచ్చదనం కనువిందు చేస్తుంది . రక్షిత జలవనరులు హిమాయత్ సాగర్ మరియు ఉస్మాన్ సాగర్ మధ్య ఉంటుంది. ఆర్‌జి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుండి కేవలం 20 నిమిషాల దూరంలో మరియు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుండి 15 నిమిషాల దూరంలో అప్పా జంక్షన్ పీరంచెరులో అత్యంత ప్రత్యేకమైన స్థానాన్ని మెగాలియో ఆస్వాదిస్తోంది. 50 అంతస్తులు మరియు 150 సంపన్నమైన, అత్యద్భుతమైన నివాసాలతో, మెగాలియో యొక్క ఐకానిక్ టవర్లు విమానాశ్రయం నుండి కూడా కనిపిస్తాయి, ఇది ఈ నిర్మాణ అద్భుతాన్ని నేటి తరపు మైలురాయిగా మారుస్తుంది.
పర్యావరణ అనుకూలత లక్ష్యంగా చేసుకున్న , రెరా ఆమోదించబడిన ప్రాజెక్ట్ డబుల్-హైట్ సీలింగ్స్ , ఆకట్టుకునే ముఖభాగం, విశాలమైన ఇంటీరియర్స్ మరియు ఐజిబిసి సర్టిఫైడ్, లీడ్ -రూపకల్పన నివాసాలతో అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంది.
ముత్యాల నగరం తమ కీర్తి కిరీటం లో మరో కలికితురాయిని జోడించుకోబోతుంది . హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన నవనామి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ రోజు నగరంలో తమ నిర్మాణాత్మక వైభవం – ది మెగాలియోను ఆవిష్కరించింది. విలాసవంతమైన రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌గా ప్రణాళిక చేయబడిన మెగాలియో, నవనామి యొక్క ఆలోచనాత్మకమైన డిజైన్ యొక్క ప్రతిష్టాత్మక ప్రదర్శనగా మరియు నాణ్యత, వినూత్నమైన డిజైన్‌లు మరియు నిజమైన లగ్జరీ ఆర్కిటెక్చర్ కోసం దాని నిరంతర అన్వేషణకు సాక్ష్యంగా భావించబడుతుంది.

నవనామి యొక్క మెగాలియో ను వివిధ రంగాల ప్రముఖులు హాజరుకాగా నిర్వహించిన ఒక భారీ కార్యక్రమం లో నవనామి వ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ నవీన్ గద్దె ఆవిష్కరించారు, శ్రీ రాజీవ్ కుమార్ శర్మ, ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్, డిజైన్ హాస్ మరియు తియర్రా డిజైన్ నుంచి అంతర్జాతీయంగా ప్రసిద్ద చెందిన కన్సల్టెంట్లు, అరుప్ ఆప్టిమైజేషన్ కన్సల్టెంట్‌లు , ఇతర దర్శకులు మరియు అతిథులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవనామి వ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ నవీన్ గద్దె మాట్లాడుతూ, “మెగాలియో ప్రారంభంతో మా అందరికీ కల సాకారమైంది. డిజైన్ మరియు ఆవిష్కరణల సరిహద్దులను అధి గమించటం అనేది నవనామి వద్ద మా ప్రయత్నం. డిజైన్, పర్యావరణ అనుకూలత మరియు రాజీలేని విలాసం యొక్క శ్రావ్యమైన కలయికను మెగాలియో సూచిస్తుంది. మేము మా కలను సాకారం చేసుకునేందుకు కృషి చేస్తున్న వేళ, హైదరాబాద్ యొక్క గొప్ప వారసత్వం , భవిష్యత్తు కోసం దాని ఆకాంక్షల యొక్క సాహసోపేత ప్రకటనగా మెగాలియో నిలుస్తుందని మేము సగర్వంగా వెల్లడిస్తున్నాము. ఊహల సరిహద్దులను సైతం అధిగమించి కొత్త జీవన నమూనాను అనుభవించడానికి ప్రపంచాన్ని మేము ఆహ్వానిస్తున్నాము . ఇక్కడ ప్రతి క్షణం అసాధారణమైన వేడుకగా ఉంటుంది” అని అన్నారు.

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి కేవలం 20 నిమిషాల దూరంలో మరియు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుండి కేవలం 15 నిమిషాల దూరంలో, అప్పా జంక్షన్ పీరంచెరులో అత్యంత ప్రత్యేకమైన ప్రాంతంలో మెగాలియో ఉంది. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ మరియు NH 163 వంటి ప్రధాన రహదారులకు చక్కగా అనుసంధానించబడి ఇది ఉంది. దాదాపు 4.1 ఎకరాలలో విస్తరించి ఉన్న, మెగాలియో చుట్టూ దాదాపు 1200 ఎకరాలలో పచ్చదనం కనువిందు చేస్తుంది. రక్షిత జలవనరులైన హిమాయత్ సాగర్ మరియు ఉస్మాన్ సాగర్‌ల పరిసరాల్లో భవిష్యత్ నివాసితులకు సహజమైన వాతావరణానికి హామీ కల్పిస్తుంది. సంస్థ యొక్క కలల ప్రాజెక్ట్, మెగాలియో. హైదరాబాద్‌ లో ఒక నిర్మాణ అద్భుతంగా భావించబడుతుంది. ఈ ప్రాంతంలో మెగాలియో యొక్క మహోన్నతమైన ఉనికిని రెండు ఐకానిక్ టవర్లు కలిగి ఉంటాయి, ఇందులో మొత్తం 50 అంతస్తులు మరియు 150 సంపన్నమైన , వైభవోపేత నివాసాలు ఉన్నాయి. ఈ జంట టవర్లు మెగాలియోను నగరానికి స్ఫూర్తిదాయక మైలురాయిగా నిలపనున్నాయి.

రెరా-ఆమోదిత ప్రాజెక్ట్ డబుల్-హైట్ సీలింగ్స్ తో అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంది, ఆలోచనాత్మకంగా తీర్చిదిద్దబడిన ముఖభాగం మరియు విశాలవంతమైన ఇంటీరియర్‌తో విశేషమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. వైభవంగా రూపొందించబడిన 150 నివాసాలు, ప్రతి ఒక్కటి వైభవం మరియు విలాసత యొక్క ప్రదర్శన గా , మూడు యూనిట్లుగా విభజించబడింది: 11,111 చదరపు అడుగుల విస్తీర్ణంతో స్కైలైన్ టవర్ యూనిట్లు; 9999 చదరపు అడుగుల మరియు 8888 చదరపు అడుగుల విస్తీర్ణంలో యూనిటీ టవర్ యూనిట్లు ఉంటాయి.
ప్రకృతికి నడిబొడ్డున ఉండటంతో పాటు, నవనామి యొక్క మెగాలియో ప్రాజెక్ట్ మధ్యలో అంతర్నిర్మిత సస్టైనబిలిటీ కలిగి ఉంటుంది. డిజైన్‌హాస్, టియెర్రా, అరూప్ అండ్ ఆప్టిమైజేషన్ కన్సల్టెంట్స్ తో సహా ప్రపంచ-ప్రసిద్ధ ఆర్కిటెక్చరల్ డిజైన్ మరియు ఇంజినీరింగ్ సంస్థల సమిష్టి సహకారంతో మెగాలియో రూపొందించబడింది, ఇది నిర్మాణ చాతుర్యం మరియు పర్యావరణ అనుకూల జీవనం యొక్క సామరస్య కలయికను సూచిస్తుంది. దాని డబుల్-హైట్ సీలింగ్స్ మరియు ఆకట్టుకునే రీతిలో తీర్చిదిద్దబడిన ముఖభాగం నుండి దాని ఐజిబిసి సర్టిఫికేట్ మరియు లీడ్ -రూపొందించిన నివాసాల వరకు, మెగాలియో యొక్క ప్రతి అంశం విలాసం మరియు సౌకర్యాన్ని పెంచుతూ దాని పర్యావరణ పాదముద్రను కనిష్టీకరించడానికి ఖచ్చితంగా నిర్వహించబడుతుంది. సంపన్న వర్గాలకు చెందిన వ్యక్తుల అవసరాలను తీర్చటం కోసం తీర్చిదిద్దబడిన మెగాలియో అసమానమైన సౌకర్యాలు మరియు సదుపాయాలను కలిగి ఉంది, ఇది అల్ట్రా-లగ్జరీ లివింగ్ భావనను నూతన శిఖరాలకు తీసుకువెళ్తుంది. నివాసితులు బ్రాండెడ్ కిచెన్‌లు, అత్యాధునిక గృహ ఆటోమేషన్ సిస్టమ్‌లు, శబ్ద-నియంత్రిత కిటికీలు, విలాస వంతమైన స్నానపు గదులు మరియు పర్యావరణ స్పృహను సజావుగా మిళితం చేసే సస్టైనబిలిటీ ఫీచర్‌లలో అధునాతను ఆనందిస్తారు. EV ఛార్జింగ్ సామర్థ్యాలతో ప్రైవేట్ గ్యారేజీలు, 9-అడుగుల డోర్‌వేస్ మరియు అంతర్జాతీయంగా పలు ప్రాంతాలలో లభించే ఫ్లోరింగ్ మెటీరియల్‌లు మెగాలియో యొక్క ప్రత్యేక ఆకర్షణను మరింత పెంచుతాయి. వాగ్దానం చేసినట్లుగా ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌తో, మెగాలియో ఇప్పటికే వివేకవంతులైన కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షించింది.