రాజకీయ పార్టీలకు మండలి చైర్మన్‌ షరీఫ్‌ లేఖ

Shariff Mohammed Ahmed
Shariff Mohammed Ahmed

అమ‌రావ‌తి: రాజకీయ పార్టీలకు ఏపి శాసన మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ లేఖ రాశారు. సెలెక్ట్‌ కమిటీకి పేర్లు ఇవ్వాలని ఛైర్మన్‌ లేఖలో పేర్కొన్నారు. 9 మందితో సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటుకు నిర్ణయించినట్లు తెలిపారు. రాజధాని బిల్లు ఏపి అసెంబ్లీలో ఆమోదం పొంది, శాసన మండలికి రాగా దీనిపై చర్చ జరిగింది. అయితే మండలి చైర్మన్‌కు ఉన్న విచక్షణాధికారంతో బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయం పై స్పందించిన ఏపి గవర్నర్‌ స్పీకర్‌ తమ్మినేని, మండలి చైర్మన్‌ షరీఫ్‌తో విడిగా భేటీ కూడా అయ్యారు. ఈ నేపథ్యంలో రెండు బిల్లులకు రెండు సెలెక్ట్‌ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. కమిటీల ఛైర్మన్లుగా సంబంధిత మంత్రులను నియమించనున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/