డాక్టర్ సుధాకర్ మృతి

సస్పెన్షన్ కేసుపై తీర్పు రావాల్సి ఉండగా అంతలోనే విషాదం

Dr Sudhakar-File
Dr Sudhakar-File

నర్సీంపట్నం కు చెందిన డాక్టర్ సుధాకర్ (52) గుండెపోటుతో మృతి చెందారు. ఈయన గత ఏడాది కరోనా రోగులకు సేవల్లో మ‌త్తు వైద్య నిపుణుడుగా పనిచేశారు. అప్పట్లో ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేవని, ప్రభుత్వాధికారులు ఎవరూ తమకు సహకరించడం లేదని ఆలయం తీవ్ర విమర్శలు చేశారు. ఆసుప‌త్రిలో గ్లౌజ్‌లు, మాస్కులు ఇవ్వ‌లేద‌ని ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దిగుతూ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే . ఈ విషయం పై ప్రభుత్వం సుధాకర్‌ ను విధుల నుంచి సస్పెండ్ చేసింది.

నడిరోడ్డుపై పోలీసులు ఆయనను చిత్రహింసలకు గురిచేశారని వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. సుధాకర్ మానసిక స్థితి బాగాలేదంటూ విశాఖపట్టణంలోని మానసిక ఆసుపత్రిలో చికిత్స అందించారు కూడా. దీంతో సుధాకర్ కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. త్వరలోనే ఈ కేసులో తీర్పు రావాల్సి ఉండగా ఇలా జరిగింది. కాగా, సుధాకర్‌ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకోలేదు. దీంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/