ఆనందయ్య కు సైనిక భద్రత కల్పించొచ్చు కదా !

ట్విట్టర్ లో ఆర్జీవీ సెటైర్లు

Ramgopal Varma
Ramgopal Varma

ఇపుడు సంచలనంగా మారిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య పై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ తనదైన శైలిలో వ్యంగ్యంగా కామెంట్స్ పోస్ట్ చేశారు. ఓ రేంజ్‌లో సెటైర్లు వేశారు. ‘‘ఎయిర్ ఫోర్స్ వన్‌ లో కృష్ణపట్నం కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, శాస్త్రవేత్త డాక్టర్ ఫౌసీ బయలు దేరారని తెలిసింది. ఆనందయ్యతో డీల్ కుదుర్చుకోవడానికై అయ్యిండొచ్చు. ఆయన కిడ్నాప్ కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఆనందయ్యను జాతీయ సంపదగా గుర్తించి, సైనిక భద్రత కల్పించొచ్చు కదా’…’ అంటూ ఆర్జీవీ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/