సాత్విక్‌ సూసైడ్‌ లెటర్‌లో సంచలన విషయాలు

నార్సింగ్ లోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతున్నవిద్యార్థి ఎన్‌. సాత్విక్‌ మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కాలేజీ యాజమాన్యం ఒత్తిడి వల్లే సాత్విక్‌ చనిపోయాడని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సాత్విక్‌ సూసైడ్‌ లెటర్‌ బయటపడింది.

తన చావుకు ఆ నలుగురే కారణం అంటూ సాత్విక్‌ తన ఆవేదన తెలిపాడు. అమ్మ, నాన్న, అన్న.. ఈ పని చేస్తున్నందుకు సారీ. మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం లేదు. కృష్ణారెడ్డి, ఆచార్య, శోభన్‌, నరేష్‌ వేధించారు. వాళ్ల వేధింపులు తట్టుకోలేకపోయా. హాస్టల్‌లో వాళ్లు విద్యార్థులకు నరకం చూపారు. వాళ్ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నా. నన్ను వేధించిన నలుగురిపై యాక్షన్‌ తీసుకోండి . అమ్మ, నాన్న లవ్‌ యు, మిస్‌ యూ ఫ్రెండ్స్‌ . టార్చర్ తట్టుకోవడం నా వల్ల కావట్లేదు అమ్మా… అందుకే నేను ఈ చెడ్డ పని చేశాను.. సారీ అమ్మ.. నేను పడే టార్చర్… ఎవరికీ రావొద్దని కోరుకుంటున్నా.. అమ్మ.. ప్లీజ్ మీరు వాళ్ల మీద సీరియస్ యాక్షన్ తీసుకోండి.. నేను మీ అందరినీ చాలా బాధ పెడుతున్నా సారీ.. నన్ను క్షమించండి ప్లీజ్ అంటూ సాత్విక్‌ తన సూసైడ్‌ లెటర్‌లో రాశాడు.

ఇప్పటికే పోలీసులు సాత్విక్ తల్లిదండ్రుల పిర్యాదు మేరకు శ్రీచైతన్య కాలేజీ యాజమాన్యం ఫ్యాకల్టీ ఆచార్య, కృష్ణారెడ్డి, వార్డెన్ నరేష్ పై కేసులు నమోదు చేశామని ఏసీపీ రమణ గౌడ్ చెప్పారు. గతంలో కొంతమంది సిబ్బంది స్టూడెంట్స్ ను క్లాస్ రూమ్ లోనే కొట్టిన వీడియోలపైనా దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.