ప్రకాష్ రాజ్ ప్యానల్ కు వార్నింగ్ ఇచ్చిన నరేష్

ప్రకాష్ రాజ్ ప్యానల్ కు సీనియర్ నటుడు నరేష్ వార్నింగ్ ఇచ్చారు. మా ఎన్నికల్లో విష్ణు ప్యానల్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ ప్యానల్ తరుపున గెలిచినా సభ్యులు రాజీనామా చేసి షాక్ ఇచ్చారు. తమ రాజీనామాలను ఆమోదించాలని విష్ణు ను కోరారు. ఈ క్రమంలో విష్ణు ప్యానల్ కు సపోర్ట్ గా నిలిచినా నరేష్..ప్రకాష్ రాజ్ ప్యానల్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు.

‘‘ఓడినా, గెలిచినా కలసి పనిచేస్తాం అన్నారు. ఇప్పుడేమైంది? బయటి నుంచి ప్రశ్నించడం ఏంటి? ‘మా’ అనేది కుటుంబం. రిజైన్‌ చేసిన ఈసీ మెంబర్స్‌ గురించి కొత్త ప్యానల్‌ చూసుకుంటుంది. విష్ణుని ఎవరైనా డిస్టర్బ్‌ చేేస్త బాగోదు. ప్రశాంతంగా అతన్ని పని చేసుకోనివ్వండి’ అని అన్నారు. ‘మా’ ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలను నరేశ్‌ ఖండించారు. కొంత మంది మగవాళ్లు ఏడ్వడం చూశాను అంటూ పరోక్షంగా బెనర్జీ, ఉత్తేజ్‌లపై దారుణమైన కామెంట్స్‌ చేశారు. ‘ఇప్పటికీ పిలుస్తున్నాం. కలిసి పని చేద్దాం రండి’ అని నరేష్‌ అన్నారు.