హైదరాబాద్ జూపార్క్ లో యువకుడి హల్చల్..సింహం ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లేందుకు యత్నం

హైదరాబాద్ జూపార్క్ లో యువకుడి హల్చల్ సృష్టించాడు. ఏకంగా సింహం ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లేందుకు ట్రై చేసాడు. ఒక్కసారిగా యువకుడ్ని చూసి జూ పార్క్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. సదరు యువకుడ్ని పట్టుకొని కిందకు తీసుకొచ్చారు. యువకుడు ఎన్ క్లోజర్ దూకుతుండగా లోపల ఉన్న సింహం ఆ యువకున్ని పట్టు కునేందుకు ట్రై చేసింది. అయితే సమయానికి జూ పార్క్ సెక్యూరిటీ సిబ్బంది రావడంతో సింహానికి ఆహారం కాకుండా బ్రతికిపోయాడు.
సదరు యువకుడి పేరు సాయి కుమార్ అని , ఎర్రగడ్డకు చెందిన ఇతడు హోటల్‌లో హెల్పర్‌గా పని చేస్తున్నట్లు జూ సిబ్బంది గుర్తించారు. అయితే సాయికుమార్ మానసిక పరిస్థితి సరిగాలేదని చెప్పారు. బహదూర్‌పురా పోలీసులకు యువకుడిని అప్పగించారు. జూ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
https://youtube.com/watch?v=IMxzy0oB1gY