తేజు..బురద ఉండడం వల్ల జారిపడ్డాడట..నరేష్ కామెంట్స్ ఫై నెటిజన్లు ట్రోల్

తేజు..బురద ఉండడం వల్ల జారిపడ్డాడట..నరేష్ కామెంట్స్ ఫై నెటిజన్లు ట్రోల్

సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన సమయంలో సీనియర్ నటుడు నరేష్ చేసిన కామెంట్స్ అభిమానులను , చిత్రసీమ ప్రముఖులను ఆవేదనకు గురి చేసాయి. కొంతమంది డైరెక్ట్ గా నరేష్ చేసిన కామెంట్స్ ను తప్పుబట్టారు. వారిలో హీరో శ్రీకాంత్ కూడా ఉన్నారు. ‘మాట్లాడేటప్పుడు ఓసారి ఆలోచించి మాట్లాడండి..మీరు మాట్లాడింది కరెక్ట్‌ కాదనిపించింది. ఎందుకనో ఈ టైమ్‌లో చనిపోయిన వారి గురించి ప్రస్తావించకుండా ఉంటే బాగుండేదేమో.. అని నాకు అనిపించింది’’ అని శ్రీకాంత్‌ చెప్పుకొచ్చారు.

శ్రీకాంత్ చేసిన కామెంట్స్ కు నరేష్ స్పందించారు. ”శ్రీకాంత్‌ ఏంటమ్మా బైట్‌ అలా ఇచ్చావ్‌. సాయిధరమ్‌ తేజ్‌ ఆ సమయంలో స్పీడ్‌లో లేడు. బురద ఉండడం వల్ల జారిపడ్డాడు. నేను చెప్పిన బైట్‌లో తేడాను సరిదిద్దుకున్నాను. బైట్స్‌ ఇచ్చేటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను చనిపోయినవాళ్ల గురించి మాట్లాడలేదు. జనరల్‌గా ఇండస్ట్రీలో జరిగిన వాటి గురించి మాట్లాడాను. బైక్‌లను మనం చాక్లెట్స్‌లాగా పిల్లలకు ఇవ్వము. ప్రమాదాలు ఎవరికైనా జరుగుతాయి. కానీ నువ్వ ఇచ్చిన బైట్‌ వల్ల హర్ట్‌ అయ్యాను. నా కళ్ల ముందు నువ్వు హీరోగా వచ్చి మంచి సినిమాలు చేసి ఎదిగావ్‌. మా ఎన్నికల్లో నా ఎదురు ప్యానల్‌ ద్వారా పోటీ చేసి ఓడిపోయావ్‌? దయచేసి ఇంకోసారి ఇలాంటి బైట్స్‌ ఇవ్వవద్దు’’ అని నరేశ్ చెప్పుకొచ్చారు. అయితే నరేష్ వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ప్రమాద స్థలంలో ఇసుక, మట్టి ఉంది కానీ బురద ఎక్కడ ఉంది నరేశ్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.