తేజు ను కాపాడిన యువకులపై తప్పుడు ప్రచారం..

ఈరోజుల్లో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగింది. ఇష్టం వచ్చినట్లు అందులో వార్తలు ప్రచారం చేస్తున్నారు. అయితే వాటిలో నిజాలకన్నా అబద్దాలే ఎక్కువగా ఉన్నాయి. వాటినే నిజం అనుకోని చాలామంది అనుకుంటున్నారు. తాజాగా సాయి ధరమ్ తేజ్ ను కాపాడిన యువకుల ఫై కూడా తప్పుడు ప్రచారం చేయడం తో వారు బాధపడుతున్నారు. శుక్రవారం సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం లో గాయపడిన సంగతి తెలిసిందే.

తేజు ప్రమాదానికి గురికాగానే నిరుపేద యువకులైన మహ్మద్ ఆసిఫ్, మహ్మద్ అబ్దుల్ ఫర్హాన్‌ తేజు ను కాపాడి 108 కు , పోలీసులకు ఫోన్ చేయడం..హాస్పటల్ వరకు వెళ్లడం చేసారు. మరుసటి రోజు వరకు కూడా వారు కాపాడింది తేజు ను అని తెలియదు. కేవలం సాటి మనిషిగానే సాయం చేశామని చెప్పుకొచ్చారు. అయితే వీరిపై కొన్ని యూట్యూబ్ చానెల్స్ లలో తప్పుడు ప్రచారం చేయడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మెగా ఫ్యామిలీ హీరోలు పది లక్షలు ఇచ్చారు.. ఐదు లక్షలు ఇచ్చారు.. కారు ఇచ్చారు.. బైక్‌లు ఇచ్చారు అని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు రాసేస్తున్నారని.. అయితే ఇప్పటి వరకూ తమకు పోలీసులు తప్ప మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ ఫోన్ చేయలేదన్నారు. సాయం చేసి ఫలితం ఆశించే స్వభావం తమది కాదని.. అయితే కొంతమంది ఇలా తప్పుడు వార్తలు రాయడం వల్ల బాధకలుగుతుందన్నారు. మాకు ఎవరో సాయం చేయాలని కోరుకోవడం లేదని.. ఆ ప్లేస్‌లో సాధారణ వ్యక్తి ఉన్నా మేం అలాగే స్పందించేవాళ్లం అని వారు చెప్పుకొస్తున్నారు. దయచేసి ఇలాంటి వార్తల్ని నమ్మొద్దన్ని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.