కర్నూలు జిల్లాలో అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు

56 కు చేరిన కరోనా భాధితులు

kondareddy buruju
kondareddy buruju

కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో కరోనా పంజా విసురుతుంది. రాష్ట్రంలోనే అత్యధింకంగా కరోనా కేసులు కర్నూలు జిల్లాలోనే నమోదు కావడం ఇందుకు నిదర్శనం. జిల్లాలో మొత్తం 56 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. నిన్న ఒక్కరోజే జిల్లాలో 53 కరోనా కేసులు నమోదు కాగా అందులో 52 కేసులు ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారివే కావడం గమనార్హం. ఇప్పటివరకు జిల్లా నుంచి 463 మంది శాంపిల్స్‌నను సేకరించగా.. అందులో 343 మంది రిపోర్టులు వచ్చాయి. ఇందులో 287 మందికి నెగిటివ్‌ రాగా.. 56 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో నేటినుంచి కర్నూలు జిల్లాలో లాక్‌డౌన్‌ నిబందనలను మరింత కఠినం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/