మంగళగిరి కోర్టుకు హాజరైన నారా లోకేశ్

అజయ్ రెడ్డిపై క్రిమినల్ కేసు వేసిన లోకేశ్

Nara Lokesh Attends To Mangalagiri Court

అమరావతిః టిడిపి హయాంలో స్కిల్ డెవలప్ మెంట్ లో భారీ కుంభకోణం జరిగిందంటూ తనపై ఆరోపణలు చేసిన స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అజయ్ రెడ్డిపై టిడిపి యువనేత నారా లోకేశ్ క్రిమినల్ కేసు వేసిన విషయం తెలిసిందే. అంతేకాదు జీఎస్టీ ఎగవేసిన కంపెనీలకు నోటీసులు ఇస్తే స్కిల్ స్కాంపై ఈడీ కొరడా అంటూ, తనకు సంబంధం ఉందంటూ కథనాలు రాసిన సాక్షిపై కూడా లోకేశ్ న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరిలోని కోర్టుకు లోకేశ్ హాజరయ్యారు. న్యాయమూర్తి ఎదుట ఆయన వాంగ్మూలం ఇచ్చారు. తనపై అసత్య ఆరోపణలు చేసి, తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించిన వైఎస్‌ఆర్‌సిపి నేతలు పోతుల సునీత, గుర్రంపాటి దేవేందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కూడా లోకేశ్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోబోనని గతంలోనే లోకేశ్ హెచ్చరించారు. నిరాధార ఆరోపణలు చేసే వారిపై న్యాయ పోరాటం చేస్తానని ఆయన అన్నారు.