చంద్ర‌బాబు త‌ర‌ఫున నారా భువ‌నేశ్వ‌రి నామినేష‌న్‌

Nara Bhuvaneshwari’s nomination on behalf of Chandrababu

అమరావతిః టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌ర‌ఫున కుప్పంలో ఆయ‌న భార్య భువ‌నేశ్వ‌రి నామినేష‌న్ దాఖ‌లు చేశారు. కుప్పంలో రిట‌ర్నింగ్ అధికారి (ఆర్ఓ) కి నామినేష‌న్ ప‌త్రాల‌ను ఆమె అంద‌జేశారు. అంత‌కుముందు ఆమె టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ శ్రేణుల‌తో క‌లిసి భారీ ర్యాలీగా ఆర్ఓ కార్యాల‌యానికి చేరుకున్నారు.

కాగా, నామినేష‌న్ దాఖ‌లుకు ముందు భువ‌నేశ్వ‌రి శుక్ర‌వారం ఉద‌యం ఆల‌యం, మ‌సీదు, చ‌ర్చిలో నామినేష‌న్ ప‌త్రాలతో ప్ర‌త్యేక పూజ‌లు, ప్రార్థ‌న‌లు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. దీనిలో భాగంగా స్థానిక ప్రసన్న వరదరాజస్వామి ఆలయంలో చంద్రబాబు నామినేషన్ పత్రాలను ఉంచి భువనేశ్వరి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం లక్ష్మీపురంలో ఉన్న మసీదు ఆవరణలో ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత బాబూనగర్ లో ఉన్న చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు.