గవర్నర్ తో ముగిసిన మంత్రి సబితా భేటీ

గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్‌తో..విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మంత్రితో పాటు అధికారులు పాల్గొన్నారు. కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లుపై గవర్నర్‌కు వివరణ ఇచ్చారు. యూజీసీ నిబంధనల అమలు, న్యాయపరమైన అంశాలు, రిజర్వేషన్లు వంటి వాటిపై గవర్నర్ వివరాలు అడిగారు. అన్ని నిబంధనలు పాటిస్తున్నామని గవర్నర్ కు మంత్రి, అధికారులు తెలిపారు.

ప్రస్తుత విధానంలోని ఇబ్బందులు, కొత్త విధానంతో వచ్చే సౌలభ్యాన్ని.. గవర్నర్‌ దృష్టికి మంత్రి తీసుకెళ్లారు. నియామకాలు త్వరగా జరిగేందుకు, సజావుగా సాగేందుకు చేపట్టాల్సిన అన్ని విషయాలపై గవర్నర్‌కు సబిత నివేదిక అందించారు. యూనివర్సిటీ ల బిల్లుపై సందేహాలు నివృత్తి చేసేందుకు సమయం ఇస్తే.. వచ్చి చర్చిస్తామని విద్యాశాఖ అధికారులు గవర్నర్‌ కార్యాలయాన్ని కోరారు.