ఫ్రాన్స్ లో ఆంక్షలు కఠినతరం

ప్రభుత్వ అధికార ప్రతినిధి వెల్లడి

regulations are tightened in France
regulations are tightened in France

భారత్ నుంచి ఫ్రాన్స్ వెళ్లే ప్రయాణికులపై ఆంక్షలు విధించేందుకు ఫ్రాన్స్ సిద్ధం అవుతోంది. వీరు 10 రోజులపాటు క్వారెంటైన్‌లో ఉండేలా ఆదేశాలు జారీ చేసేందుకు సమాయత్తమైంది ఈ మేరకు ఫ్రాన్స్ ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. పలు దేశాల్లో కరోనా తీవ్రత చాలా తీవ్రంగా ఉన్నట్టు గుర్తించామని, అందుకే నిబంధనలు కఠినతరం చేసేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలిపారు. ఆయా దేశాల నుంచి ఫ్రాన్స్‌కు వచ్చే ప్రయాణికులపై కఠిన ఆంక్షలకు సిద్ధం అవుతున్నామని ఆయన అన్నారు. వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆయా దేశాల జాబితాలో భారత్‌ కూడా ఉన్నట్టు తెలిపారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/