‘స్టే సేఫ్టీ.. స్టే హెల్దీ’

నమత్ర శిరోద్కర్ వీడియో మెసేజ్‌ పోస్ట్

Namrata Shirodkar Video Message Post

కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతున్న క్రమంలో మరింత దయనీయ సంఘటనలను చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది.

ఇక కరోనా వైరస్ సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ప్రముఖులు సోషల్ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. దీనిలో భాగంగా సేవ్ హాండ్స్ ఛాలెంజ్ సెలెబ్రటీలు ప్రారంభించారు.

సినిమా సహా అన్నీ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని మరో ముగ్గురికి సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్‌ను విసురుతున్నారు. రీసెంట్‌గా ఈ ఛాలెంజ్‌లో సూపర్ స్టార్ మహేశ్ శ్రీమతి నమత్ర శిరోద్కర్ పాల్గొన్నారు.

”కోవిడ్ 19 బారిన పడకుండా ఉండటానికి రెండు చేతులను శుభ్రం చేసుకోవాలి. 20-40 సెకన్ల పాటు రెండు చేతులను రుద్ది శుభ్రం చేసుకుంటే మంచిది.

స్టే సేఫ్టీ.. స్టే హెల్దీ” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోతో పాటు మెసేజ్‌ను పోస్ట్ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/telangana/