హైదరాబాద్ లో రేపు మెట్రో సేవలు బంద్
ప్రభుత్వ సూచనల మేరకు సేవలను ఆపేస్తున్నామని ప్రకటన

హైదరాబాద్ : హైదరాబాద్ లో రేపు మెట్రో రైల్ సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వ సూచనల మేరకు మెట్రో రైల్ యజమాన్యం అధికారికంగా ప్రకటించింది. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రధాని మోడీ పిలుపు మేరకు రేపు యావత్ దేశం జనతా కర్ఫ్యూని పాటిస్తున్న సంగతి తెలిసిందే. మోదీ పిలుపుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలు మద్దతును ప్రకటించాయి. ప్రజలు కూడా స్వచ్చందంగా జనతా కర్ఫ్యూని పాటించేందుకు ముందుకు కదులుతున్నారు. ఈ నేపథ్యంలో మెట్రో కూడా తన సేవలను ఆపేస్తోంది. అంతే కాక రేపు పరిమిత సంఖ్యలో ఎంఎంటీఎస్ సర్వీసులు నడపనున్నట్టు దక్షణ మధ్య రైల్వే సీపీ ఆరో రాకేష్ తెలిపారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/