కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడికి పంపించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లుగా అందులో పేర్కొన్నారు. కిరణ్ కుమార్ బీజేపీలో చేరతారంటూ గత వారం రోజులుగా ప్రచారం అవుతున్న నేపథ్యంలో.. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పడంతో ఆ వార్తలకు బలం చేరుతున్నట్లు అయ్యింది.

ఇటీవల ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందిస్తూ… కిరణ్ కుమార్ ఎంతో చురుకైన నాయకుడు అని, పార్టీలోకి వస్తే సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని అన్నారు. కిరణ్ వంటి నేత వస్తే, ఏపీలో బీజేపీ బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌గా, ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రిగా.. సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షులుగా .. అనుభవం ఉన్న నల్లారి కుమార్ రెడ్డి.. 2014 ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆపార్టీకి పూర్వ వైభవం తెస్తారని ఆశీంచినా.. ఎందుకో అంటీముట్టనట్లుగా ఉన్నారు. ఇప్పుడు బీజేపీలో చేరి తన పొలిటికల్ స్పీడ్ పెంచబోతున్నారు. బిజెపి లో చేరితే జాతీయ స్థాయిలో కీలక పదవికి అప్పగిస్తామని బీజేపీ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేసి , బిజెపి లో చేరబోతున్నారని అంటున్నారు. మరి ఈయన బిజెపి తీర్థం ఎప్పుడు పుచ్చుకుంటారనేది చూడాలి.