నగరవాసులకు తీపి కబురు : హెలికాప్టర్‌లో నగరమంతా చక్కర్లు కొట్టే ఛాన్స్

హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్. హెలికాప్టర్‌లో నగరమంతా చక్కర్లు కొట్టే ఛాన్స్ కల్పిస్తుంది జాయ్‌ రైడ్‌ సర్వీసు. హైదరాబాద్ నగరంలో ఎన్నో చూడాల్సిన ప్రదేశాలు ఉన్న సంగతి తెలిసిందే. రోజంతా తిరిగిన అవన్నీ చూడలేరు. ఈ క్రమంలో పలు సంస్థలు టూరిస్ట్ ప్యాకేజ్ లు కల్పిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఫ్లై హైదరాబాద్‌ పేరుతో కొత్త జాయ్‌ రైడ్‌ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చారు.

మార్చి 8 నుంచి 13వ తేదీ వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉండనుంది. బుద్ద విగ్రహంతో పాటు, నెక్లెస్ రోడ్, చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం, ఫలక్ నుమా ప్యాలెస్‌ ప్రాంతాల గుండా హెలికాప్టర్‌ రైడ్‌ ఉంటుంది. హెలికాప్టర్‌లో ప్రయణిస్తూ ఈ ప్రదేశాలను వీక్షించవచ్చు. 10 నిమిషాల పాటు సాగే హెలికాప్టర్‌ రైడ్‌ను వెయ్యి అడుగుల ఎత్తు నుంచి నగరాన్ని వీక్షించవచ్చు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. నెక్లెస్‌ రోడ్‌లోని జలవిహార్ వాటర్ పార్క్ పక్కన దీనిని ఏర్పాటు చేశారు. టికెట్ ధరను ఒక్కొక్కరికి రూ.6,500గా నిర్ణయించారు. బుక్ మై షో ద్వారా టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు.