ఆఫ్ఘనిస్థాన్ లో భారీ భూ ప్రకంపనలు

26 మంది మృతి : సహాయక చర్యలు ముమ్మరం

Massive earthquakes in Afghanistan
Massive earthquakes in Afghanistan

Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ లో భారీ భూకంపాలు సంభవించాయి. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు విడిచారు. తుర్కమెనిస్తాన్‌ కు సరిహద్దు ప్రాంతంలోని క్వాదిస్‌, ముకుర్ లో వచ్చిన భూ ప్రకంపనలకు ప్రజలు ఒక్క సారిగా భయ భ్రాంతులకు గురయ్యారు . ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారని అక్కడి ఒక మీడియా సంస్థ తెలిపింది. సహాయక చర్యలకు వెళ్లిన సిబ్బంది మధ్యలోనే చిక్కుకు పోయారు. మంగళవారం మరిన్ని సహాయక బృందాలను ఘటనా స్థలా లకు పంపనున్నట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

కరోనా లాక్ డౌన్ వార్తల కోసం: https://www.vaartha.com/corona-lock-down-updates/