మలేషియా మాజీ ప్రధానికి జైలు శిక్ష !

అవినీతి కేసుల్లో దోషిగా మాజీ ప్ర‌ధాని న‌జీబ్ ర‌జాక్

Najib Razak, ex-Malaysia PM, found guilty in 1MDB corruption trial

మలేషియా: మ‌లేషియా మాజీ ప్ర‌ధాని న‌జీబ్ ర‌జాక్ ల‌క్ష‌ల డాల‌ర్ల అవినీతి కేసులో దోషిగా తేలారు. మొత్తం ఏడు అభియోగాల్లో న‌జీబ్‌ను దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పునిచ్చింది. మ‌నీలాండ‌రింగ్‌, అధికార దుర్వినియోగానికి పాల్ప‌డ‌లేద‌ని న‌జీబ్ కోర్టుకు తెలిపారు. మ‌లేషియా డెవ‌ల‌ప్‌మెంట్ బెర్హాద్‌(వ‌న్ ఎండీబీ) ఫండ్ కేసులో భారీ అవినీతి చోటుచేసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మాజీ ప్ర‌ధాని న‌జీబ్ ఆ ఫండ్ నిధుల‌ను దుర్వినియోగం చేశార‌ని కేసు న‌మోదు అయ్యింది. ఆ ఫండ్ నుంచి సుమారు ప‌ది మిలియ‌న్ల డాల‌ర్ల అమౌంట్‌ను ప్ర‌ధాని ప్రైవేటు అకౌంట్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 2009 నుంచి 2018 వ‌ర‌కు న‌జీబ్ మ‌లేషియా ప్ర‌ధానిగా చేశారు. ఈ కేసులో మాజీ ప్ర‌ధాని న‌జీబ్‌కు 15 నుంచి 20 ఏళ్ల వ‌ర‌కు జైలు శిక్ష‌ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/