కార్మిక మంత్రి మల్లారెడ్డిపై నాయిని విమర్శలు

మల్లారెడ్డి కార్మిక మంత్రిగా ఉండటం మన ఖర్మ

naini narasimha reddy
naini narasimha reddy

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కార్మిక శాఖ మంత్రిగా ఉండటం మన ఖర్మ అని, ప్రజలు చేసుకున్న పాపమని ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి విమర్శించారు. సోమవారం సుందరయ్య విజ్ఞా న కేంద్రంలో తెలంగాణ ప్రైవేట్‌ ఉద్యోగుల సంఘం (టీపీయూఎస్‌) డైరీ ఆవిష్కరణ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన నాయిని డైరీని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజల పక్షాన ఉండాల్సిన మంత్రి మల్లారెడ్డి యాజమాన్యాలకు సహకరించి కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. పనికిరాని కార్మిక మంత్రిని చూస్తే జాలివేస్తుందన్నారు. నేడు రాష్ట్రంలో కార్మికులు సమ్మెచేసే పరిస్థితి లేదని వాపోయారు

తాజా జాతీయ వార్తాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/