స్టైలిష్ క్యారెక్టర్ డిజైన్ : ప్రవీణ్-నాగ్ మూవీ

ఇజ్రాయెల్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ లో ‘కింగ్’ ట్రైనింగ్!

Actor Nagarjuna
Actor Nagarjuna

‘కింగ్’ నాగార్జున తాజాగా ప్రవీణ్ సత్తార్ దర్సకత్వంలో మూవీకి రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో నాగార్జునను చాలా స్టైలిష్ గా చూపెట్టేందుకు క్యారెక్టర్ డిజైన్ చేశారని తెలిసింది. ప్రవీణ్ – నాగ్ కాంబినేషన్ మూవీ పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఆల్రెడీ షూట్ ప్రారంభించి నాగ్ – ప్రవీణ్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లారు. కానీ కరోనా కారణంగా బ్రేక్ పడింది. త్వరలోనే షూట్ రీస్టార్ట్ చేసెందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా , నాగ్ తో హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్ . ఈ సినిమాలో నాగ్ ఎక్స్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలిసింది .

ఈ పాత్రకోసం నాగ్ చాలానే మేకోవర్ అయ్యారట కాగా మరో న్యూస్ ఇపుడు బయటకు వచ్చింది. నాగ్ ఇజ్రాయెల్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నారని తెలిసింది. క్రావ్ మాగా – కత్తిసాము లాంటివి కూడా ట్రై చేస్తున్నారని , ఈ యాక్షన్ సీన్స్ అన్నికూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉండబోతున్నాయని సినీవర్గాల మాటగా వుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, అనిఖా సురేంద్రన్ కీలకపాత్ర చేయనుందని తెలిసింది. నారాయణదాస్ నారంగ్ పి.రామ్మోహన్ రావు శరత్ మరార్ లు సంయుక్తంగా ఈ హై వోల్టెజ్ యాక్షన్ సినిమాను రూపొందిస్తున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/