రోజువారి కూలీల‌కు క‌నీస వేత‌నం పెంపు

హైదరాబాద్: తెలంగాణ ప్ర‌భుత్వం రోజువారి కూలీల‌కు క‌నీస వేత‌నాన్ని పెంచుతూ ఉత్త‌ర్వులు  జారీ చేసింది. కూలీల‌కు రోజువారి క‌నీస వేత‌నం రూ. 300 నుంచి రూ. 390కి పెంచారు. క‌న్సాలిడేటెడ్ పే వ‌ర్క‌ర్ల వేత‌నం రూ. 8 వేల నుంచి రూ. 10,400కు పెంచారు. పార్ట్‌టైమ్ వ‌ర్క‌ర్ల వేత‌నం రూ. 4 వేల నుంచి రూ. 5,200కు పెంచుతూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులిచ్చింది. పెంచిన క‌నీస వేత‌నం ఈ ఏడాది జూన్ నుంచి అమ‌ల్లోకి వ‌స్తుంద‌న్నారు. పెరిగిన క‌నీస వేత‌నం జులై నెల‌లో కూలీల‌కు ఇవ్వాల్సి ఉంటుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/