సాంస్కృతిక మహోత్సవాల్లో పాల్గొననున్న నాగార్జున‌, చిరజీవి

హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో మ‌హోత్స‌వాలు
సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను సాయంత్రం ప్రారంభించ‌నున్న‌ ఉప రాష్ట్రప‌తి.. కిష‌న్ రెడ్డి

హైదరాబాద్: హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ సాంస్కృతిక మ‌హోత్స‌వాలు ఏర్పాటు చేశారు. ఈ రోజు క్రాఫ్ట్స్ మేళాను తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌందర రాజ‌న్, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా కిష‌న్ రెడ్డి మాట్లాడుతూ… సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను ఈ రోజు సాయంత్రం ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు ప్రారంభిస్తార‌ని చెప్పారు.

నేటి కార్య‌క్ర‌మంలో సినీన‌టుడు నాగార్జున పాల్గొంటార‌ని, రేపు జ‌రిగే ఉగాది కార్య‌క్ర‌మంలో చిరంజీవి పాల్గొంటార‌ని కిష‌న్ రెడ్డి వివ‌రించారు. వివిధ రాష్ట్రాల‌కు చెందిన వారు ఇక్క‌డ‌ స్టాల్స్ ఏర్పాటు చేశార‌ని, అవ‌న్నీ చాలా బాగున్నాయ‌ని ఈ సంద‌ర్భంగా త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ అన్నారు. భార‌తీయ సంస్కృతిని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు అవి దోహదం చేస్తాయ‌ని చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/