నేడు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని ద‌ర్శించుకున్న‌ రోజా

రోజాకు తీర్థ‌ప్రసాదాలు అందించిన‌ ఆల‌య అర్చ‌కులు


యాదాద్రి: వైస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా మొక్కులు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి చెల్లించుకున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వ‌చ్చిన‌ రోజా ఈ రోజు ఉద‌యం స్వామి వారిని దర్శించుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సుర‌భి వాణిదేవీ, యాదాద్రి జ‌డ్పీ చైర్మ‌న్ ఎలిమినేటి సందీప్ రెడ్డితో క‌లిసి పూజ‌ల్లో పాల్గొన్నారు. రోజాను ఆల‌య అర్చ‌కులు ఆశీర్వ‌దించి, ఆమెకు తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు.

కాగా, చాలా కాలం త‌ర్వాత స్వయంభూ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు అవ‌కాశం రావ‌డంతో యాదాద్రిలో భక్తుల ర‌ద్దీ పెరిగింది. కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి వ‌ద్ద కూడా భ‌క్తులు భారీగా క‌న‌ప‌డుతున్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/