‘పోసాని’ ని కుక్క తో పోల్చిన నాగబాబు

సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యల ఫై అంత మండిపడుతున్నారు. రాజకీయంగా ఏదైనా మాట్లాడితే ఆయన ఫై విమర్శలు చేయాలి కానీ వ్యక్తిగతంగా దోషించడం , ఇంట్లో ఉన్న ఆడవారిని లాగడం , వారిపై ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేయడం ఏంటి అని అంత పోసాని ఫై మండిపడుతున్నారు.

ఇక మెగా ఫ్యామిలీ ని కానీ తన అన్నదమ్ములను కానీ ఎవరైనా ఓ మాట అంటే అసలు ఊరుకొని మెగా బ్రదర్ నాగబాబు పోసాని ని కుక్క తో పోల్చాడు. నాగబాబు ‘ఆస్క్‌ మీ’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానుల ముందుకు వచ్చారు. అనేక ప్రశ్నలకు మీమ్స్ తోనే సెటైరికల్ గా సమాధానాలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ గురించి స్పందించాలని కోరగా ఆయన ఒక పవన్ పైన పోసాని మాట్లాడిన ఒక వీడియో పోస్టు చేసారు.

అందులో… పవన్‌కల్యాణ్‌ ఈ రోజు మళ్లీ సినిమా హీరోగా యాక్ట్‌ చేస్తానంటే.. నేను అతనికి బ్లాం క్‌ చెక్‌ ఇస్తా. ఎన్ని సున్నాలైనా పెట్టుకోవచ్చు. కోటా, రెండు కోట్లా, పది కోట్లా, ఇరవై కోట్లా, 30 కోట్లా! 40 కోట్లు కూడా ఇస్తా. నాకు డేట్స్‌ ఇస్తే. అంత డిమాండ్‌ ఉన్న హీరో. తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే కాదు, ఇండియాలోని టాప్‌ హీరోల్లో అతనొకరు…అని అందులో పోసాని చెబుతారు. పోసాని గురించి ఒక్క మాట అనే దానికి సమాధానంగా..‘సమరసింహారెడ్డి’లో బాలకృష్ణ ఫొటో పోస్ట్‌ చేశారు. ఆ సన్నివేశంలో డైలాగ్‌… ‘కుక్కపిల్ల మొరిగిందనుకో అనేది ఆ ఫొటో సారాంశంగా గుర్తు చేసుకుంటున్నారు.