పవన్ కళ్యాణ్ ప్రచార రథం సిద్ధం..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార రథం సిద్ధమైంది. గత ఎన్నికల్లో ఓటమి చెందిన పవన్..ఈసారి గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్నారు. గతంలో చేసిన పొరపాట్లు మరోసారి చేయకుండా..పక్క ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు. గతంతో పోలిస్తే పవన్ కళ్యాణ్ కు జనాల్లో ఆదరణ పెరగడమే కాదు జనసేన ఫై నమ్మకం సైతం రెట్టింపు అయ్యింది. ఒక్కసారి పవన్ కళ్యాణ్ కు కూడా ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని ప్రజలు అంటున్నారు.

ఇక ఎన్నికలకు ఇంకా ఏడాది పైగానే సమయం ఉన్నప్పటికీ అన్ని పార్టీలు ఇప్పటి నుండే జనాల్లోకి వెళ్తూ..నమ్మకం పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సైతం బస్సు యాత్ర తో జనాల్లోకి వెళ్ళబోతున్నారు. దసరా తర్వాత బస్సు యాత్ర చేపట్టాలని అనుకున్నారు కానీ కుదరలేదు. త్వరలోనే బస్సు యాత్ర చేపట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలో పవన్ ప్రచార రథం కూడా సిద్ధమైంది.

దీనికి సంబంధించిన ట్రయల్ రన్ వీడియో, ఫొటోలను పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో పంచుకున్నారు. ఈ బస్సుకు ‘వారాహి’ అని పేరుపెట్టినట్టు పవన్ వెల్లడించారు. ఎన్నికల యుద్ధానికి ‘వారాహి’ సిద్ధమైంది అంటూ ఆయన ట్వీట్ చేశారు. కాగా, ఈ బస్సు ఆలివ్ రంగులో చూడ్డానికి మిలిటరీ వాహనంలా కనిపిస్తోంది. ఎంతో దృఢంగా కనిపిస్తున్న ఈ వాహనంలో పవన్ కు అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ బస్సులో హై సెక్యూరిటీ సిస్టమ్ తో పాటు, జీపీఎస్ ట్రాకింగ్, 360 డిగ్రీల్లో రికార్డ్ చేయగల సీసీటీవీ కెమెరాలు, అత్యాధునిక సౌండ్ సిస్టమ్, రాత్రివేళల్లో సభల కోసం లైటింగ్ సిస్టమ్ ను పొందుపరిచారు. కాగా, ఈ వాహనం ట్రయల్ రన్ ను పవన్ స్వయంగా పర్యవేక్షించారు.