నారాయణకు గడ్డి తినడం మాన్పించి.. కాస్త అన్నం పెట్టండి – నాగబాబు

,

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తాజాగా చిరంజీవి , పవన్ కళ్యాణ్ ఫై చేసిన కామెంట్స్ పట్ల జనసేన నేత , మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. ‘‘ఇటీవలి కాలంలో మెగా అభిమానులు మరియు జనసైనికులు కొంత మంది చేసిన తెలివితక్కువ వెర్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ మన కుర్రాళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే.. ఈ సీపీఐ నారాయణ అనే వ్యక్తి చాలా కాలం నుంచి అన్నం తినడం మానేసి కేవలం ఎండు గడ్డి మరియు చెత్తా చెదారం తింటున్నాడు. ‘కాబట్టి మన మెగా అభిమానులందరికీ నా హృదయపూర్వక విన్నపం ఏమిటనగా.. దయచేసి వెళ్లి అతనితో గడ్డి తినడం మాన్పించి.. కాస్త అన్నం పెట్టండి. తద్వారా అతను మళ్లీ తెలివి తెచ్చుకుని మనిషిలా ప్రవర్తిస్తాడు’ అని నాగబాబు ట్వీట్లు చేశారు.

అసలు నారాయణ ఏమన్నాడంటే.. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు చిరంజీవి హాజరవడాన్ని ఆయన తప్పుబట్టారు. చిరంజీవి ఊసరవెల్లి లాంటివాడంటూ హాట్ కామెంట్స్ చేశారు. అల్లూరి విగ్రహావిష్కరణకు సూపర్ స్టార్ కృష్ణను వేదికమీదకు తీసుకొచ్చి ఉంటే బాగుండేదని.. అలా కాకుండా ఊసరవెల్లిలా ప్రవర్తించే చిరంజీవిని తీసుకెళ్లడమేంటని ప్రశ్నించారాయన. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ ల్యాండ్ మైన్ లాంటివాడని.. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ఆయనకే తెలియదంటూ సెటైర్లు వేశారు. ఇలా కామెంట్స్ చేయడం తో నాగబాబు ఘాటుగా స్పందించాల్సి వచ్చింది.