పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న కస్టడీ

నాగ చైతన్య – కృతి శెట్టి జంటగా వెంకట్ ప్రభు డైరెక్షన్లో తెరకెక్కిన కస్టడీ మూవీ ఈరోజు (మే 12) తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదలైంది. కాగా ఓవర్సీస్ లో నిన్ననే ప్రీమియర్ షోస్ పడగా..అక్కడ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇటు ఇండియా లోను పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా చూసిన అభిమానులు , సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సినిమా ఫై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా సినిమాలో యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి అని , సెకండ్ హాఫ్ అయితే చాలా బావుందంటూ ట్వీట్లు పెడుతున్నారు. నటన పరంగా అయితే చైతూ కేరీర్‌లోనే ఇది బెస్ట్ సినిమా అంటూ కాస్త ఎక్కువగానే చెబుతున్నారు. సినిమాలో ట్విస్టులు కూడా ఓ రేంజ్‌లోనే ఉన్నాయని అంటున్నారు.

ఇక “ట్రైన్‌లో చైతు, అరవింద్ స్వామి, శరత్‌కుమార్ మధ్య ఓ ఇంట్రెస్టింగ్ సీన్ ఉంది. ఊహించని పెద్ద ట్విస్ట్‌తో సినిమా క్లైమాక్స్‌కు చేరుకుంది.” అంటూ ఓ అభిమాని రాసుకొచ్చాడు. “ఫస్ట్ ఆఫ్ మొత్తం వెంకట్ ప్రభు తనదైన స్టైల్‌లో తీశాడు. నాగ చైతన్య, కృతి శెట్టి, అరవింద్ స్వామి బాగా నచించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎఫెక్టివ్ గా ఉంది. సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.” అని మరికొంతమంది పోస్ట్ చేసారు. ఓవరాల్ గా సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుండడం తో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటుంది.