మూసీ ఉగ్రరూపం..నీట మునిగిన చాదర్‌ఘాట్‌ పరిసర బస్తీలు

మూసీ ఉగ్రరూపం దాల్చడంతో చాదర్‌ఘాట్‌ పరిసర ప్రాంతాల్లోని బస్తీలు నీట మునిగాయి. గత కొద్దీ రోజులుగా హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తుండడంతో నగరంలోని జంట జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తివేసి నీటిని కిందకు వదులుతున్నారు. ఈ క్రమంలో భారీగా వరద నీరు మూసీ నదిలోకి వచ్చి చేరుతుండడంతో.. మంగళవారం రాత్రి మూసీ ఉగ్రరూపం దాల్చింది. దీంతో చాదర్‌ఘాట్‌ పరిసర ప్రాంతాల్లోని బస్తీలు నీట మునిగాయి. చాదర్‌ఘాట్‌ వంతెన పైనుంచి మూసీ ప్రవహిస్తోంది. దీనిని ముందే ఊహించిన అధికారులు నిన్న సాయంత్రం నుండే బ్రిడ్జి ఫై రాకపోకలను నిలిపేశారు. చాదర్‌ఘాట్‌ కాలనీలను మూసీ వరద చుట్టేసింది. దీంతో కాలనీల ప్రజలు తమ ఇళ్లకు తాళాలు వేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. మూసీ నది ఉప్పొంగి ప్రవహించినప్పుడల్లా మాకు ఇదే పరిస్థితి అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా జులై నెలలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక హైదరాబాద్ నగరమైతే తడిసిముద్దవుతోంది. ప్రతి రోజు కూడా వర్షం పడుతూనే ఉంది. దీంతో నగరవాసులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. స్కూల్స్ , కాలేజీలకు వెళ్లే స్టూడెంట్స్ , ఆఫీస్ లకు వెళ్లి ఉద్యోగులు , రోజు కూలి పనులు చేసుకునే వారు ఇలా అంత కూడా ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుతాయో అని దేవుడ్ని వేడుకుంటున్నారు.