ఢిల్లీ గడ్డపై బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు కేసీఆర్ ప్లాన్..?

తెలంగాణ ముఖ్యమంత్రి , టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్..దసరా పర్వదినాన టిఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మార్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేసీఆర్ ఢిల్లీలో ఉన్నారు. గత మూడు రోజులుగా అక్కడే మకాం వేసి బీఆర్ఎస్ ను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లని..ఏ ఏ నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై ప్రజాప్రతినిధులతో , రాజయాకియ ప్రముఖులతో చర్చలు జరుపుతున్నారు. ఇదే తరుణంలో ఢిల్లీ గడ్డపై బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సభ ద్వారా దేశ ప్రజలకు బీఆర్ఎస్ ఏర్పాటు గురించి తెలియజేనున్నారనే అంటున్నారు. ఈ సభ ఏర్పాట్లపై ముఖ్యనేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో సభ నిర్వహించాలని కేసీఆర్ ఆలోచించినట్లు వినికిడి. దేశం నలుమూలల నుంచి ప్రజలను ఈ సభకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

రైతు, దళిత సంఘాల నేతలను ఈ సభకు ఆహ్వానించే అవకాశముంది. దేశం దృష్టిని ఆకర్షించేలా ఈ సభకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ర్యాలీగా కేసీఆర్ వెళ్లడం బాగా ప్రభావం చూపింది. ఇప్పుడు కూడా అదే తరహాలో వెళ్లేలా కసరత్తులు జరుగుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఈ బహిరంగ సభలో పలు పార్టీలు, రైతు, దళిత సంఘాలు బీఆర్ఎస్‌లో విలీనం అయ్యేలా ప్రకటన ఉంటుందని అంటున్నారు. ఈ సభకు భారీగా జనాలను సమీకరించి ఢిల్లీ గడ్డపై బీఆర్ఎస్ సత్తా చూపించేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.