కరోనా ఎఫెక్ట్ : మునావర్ ఫరూఖీ షో రద్దు

పాపులర్ స్టాండ్ అప్ కమెడియన్ మునావర్ ఫారూఖీకి కరోనా దెబ్బ పడింది. జనవరి 9న హైదరాబాద్ లో జరగాల్సిన ఆయన షో రద్దు అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 కేసుల పెరుగుదల కారణంగా మరో రెండు మూడు రోజుల్లో జరగాల్సిన మునావర్ ఫారూఖీ షో రద్దు అయ్యినట్లు ప్రకటించారు.

హైదరాబాద్‌లో మునావర్ ఫారూఖీ షో ప్రకటించిన వెంటనే తెలంగాణలోని బీజేపీ నేతలు బెదిరింపులకు దిగారు. డిసెంబర్ 25న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం)ని ప్రదర్శనను నిలిపివేయాలని కోరారు. నిజామాబాద్‌కు చెందిన బీజేపీ ఎంపీ డి.అరవింద్ కూడా స్పందిస్తూ హైదరాబాద్‌లో ఫరూఖీ షోను అనుమతించబోమని చెప్పారు. కేటీఆర్‌కు, ఆయన తండ్రి కేసీఆర్‌కు హిందూ సమాజం కామెడీగా మారిందా ? అని ప్రశ్నించారు. ఇక బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆ షోను అడ్డుకుంటామని ప్రకటించారు. కానీ ఇప్పుడు కరోనా కారణంగా ఈ షో రద్దయ్యింది.