ఘోర అగ్నిప్ర‌మాదం.. ఆరుగురు క‌రోనా రోగుల మృతి

అహ్మద్‌నగర్ జిల్లా ఆసుప‌త్రిలో ప్ర‌మాదం

అహ్మద్‌నగర్ : మహరాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా ఆసుప‌త్రిలో ఘోర అగ్ని ప్ర‌మాదం సంభవించింది. ఈ ప్ర‌మాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 11 మందికి తీవ్ర గాయాల‌య్యాయి. మృతి చెందిన వారు అంద‌రూ క‌రోనా రోగులేన‌ని అధికారులు తెలిపారు.

ఈ ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్ర‌మాదం జ‌రిగిన వార్డుల్లో మొత్తం 17 మంది క‌రోనా రోగులు చికిత్స పొందుతున్నార‌ని అధికారులు చెప్పారు. గాయాల‌పాలైన 11 మంది ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఈ ప్రమాదంలో గాయపడినవారికి ప్ర‌స్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/