వివాదం లో ఆచార్య సాంగ్ ..

Chiranjeevi and Regina from Acharya
Chiranjeevi and Regina from Acharya

ఆచార్య నుండి తాజాగా వచ్చిన సాన కష్టం సాంగ్ వివాదంలో చిక్కుకుంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను డైరెక్షన్ చేస్తుండడంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కేమియో రోల్‌లో నటిస్తుండగా..ఆయనకు జోడి గా పూజా హగ్దే నటిస్తుంది.

ఇక ఇప్పటికే ఈ చిత్రం నుండి ‘లాహే లాహే’ , ‘నీలాంబరి’ పాటలు విడుదలై శ్రోతలను విశేషంగా అలరించాయి. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ.. మేకర్స్ ‘ఆచార్య’ సినిమాలోని మూడో పాట ‘సానా కష్టం’ అనే పాట లిరికల్ సాంగ్ ను విడుదల చేసారు. ఈ సాంగ్ లో చిరంజీవి అదిరిపోయే స్టెప్స్ వేయడం..రెజీనా గ్లామర్ పాటకు మరింత జోష్ నింపింది. దీంతో యూట్యూబ్ లో ఈ సాంగ్ భారీ వ్యూస్ రాబడుతూ దూసుకెళ్తుంది. ఈ క్రమంలో ఈ సాంగ్ వివాదంలో చిక్కుకోవడం అభిమానులను షాక్ కు గురి చేసింది.

‘‘సానా కష్టం’’ పాట తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆర్ఎంపీ, పీఎంపీల సంఘం జనగామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాట రచయిత, దర్శకులపైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. సానా కష్టం పాటలో ‘‘ ఏడేదో నిమరచ్చని కుర్రోళ్లు ఆర్ఎంపీలు అయిపోతారనే’’ లిరిక్ అభ్యంతరంగా ఉందంటూ ఆర్ఎంపీలు ఫిర్యాదు చేశారు. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

YouTube video