జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్ కు కొత్త కారు కొన్న ఆనందం లేకుండా పోయింది

జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్ కొత్త కారును కొనుగోలు చేసాడు. ఈ విషయాన్నీ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులకు తెలియజేసాడు. అయితే దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని , గుండెలో స్టంట్స్‌ వేశారని స్వయంగా యూట్యూబ్‌ ఛానల్‌లో వెల్లడించాడు. ఇప్పుడిప్పుడే ఆమె ఆరోగ్యం కుదుటపడుతోంది అని తెలిపాడు.

ఈ సమయంలో అవినాష్ కొత్త కారు కొన్నాడు. పాత కారుకు యాక్సిడెంట్‌ అయిందని, అది డ్యామేజ్‌ కావడంతో దాన్ని ఎక్స్‌చేంజ్‌ చేసి కొత్త కారు కొన్నట్లు తెలిపాడు. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కారును కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు. దీని ధర దాదాపు రూ.25 లక్షల మేర ఉంటుందని తెలుస్తోంది. ఈ కారుకు పూజ చేయించిన వీడియోను తన యూట్యూబ్‌ ఛానల్‌లో షేర్‌ చేశాడు. తల్లికి ఆరోగ్యం బాగాలేని సమయంలో కొత్త కారు ఎలా కొనాలనిపించిందని పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

‘మీ అమ్మకు ఆరోగ్యం బాగోలేదని వీడియో తీశావు. ఆ వీడియో ద్వారా వచ్చిన డబ్బుతో అప్పుడే కొత్త కారు కొన్నావు. మంచి మంచి కట్టుబాట్లు ఉన్నాయే’ అని సెటైర్లు వేస్తున్నారు. మొత్తం మీద నెటిజన్ల నుండి వస్తున్న రియాక్షన్ కు అవినాష్ కు కొత్త కారు కొన్న ఆనందం లేకుండా పోతుంది.