అదే ప్రాజెక్ట్‌కు పేరు మార్చి మళ్లీ అనుమతులు
ఏపి రాష్ట్ర ముఖ్యమంత్రిపై నారాలోకేష్ విమర్శలు

అమరావతి: దేశంలో కలగా మిగిలిపోయిన నదుల అనుసంధానం నిజం చేసి చూపించారు చంద్రబాబు. పట్టిసీమ ద్వారా గోదావరి – కృష్ణా నదులను కలిపారు. అదే స్పూర్తితో గోదావరి, పెన్నా నదులను అనుంసందానం చేసి సాగర్ ఆయకట్లుకి నీరు ఇవ్వాలని తలచి ఆనాడు చంద్రబాబు పనులు ప్రారంభించారు. అపుడు ఇదో పెద్ద స్కాం, అంతా మాయా, నీళ్లు రావు అంటూ ఎగతాళి చేసిన వైయస్‌ఆర్‌సిపి, ఇవాళ అదే ప్రాజెక్ట్, ఏదైతే మాయా అన్నారో, స్కాం అన్నారో, దానిని తన తండ్రి పేరుతో మార్చి , వైయస్‌ఆర్‌సిపి పల్నాడు కరువు నివారణ పథకంగా పేరు మార్చి, అదే రూ. 6020 కోట్లతో అనుమతులు ఇచ్చారు. ఇలాంటి వారిని ఏమనాలి అంటూ ట్విట్టర్ వేదికగా ఏపి ముఖ్యమంత్రి జగన్ పై నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ గారు తన తండ్రి పేరు పెట్టుకుని ప్రజలను మభ్య పెడుతున్నారు. ఇది నేటి రాజకీయం అంటూ విమర్శలు కురిపించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/