పవన్ కల్యాణ్‌కు రెండు లేఖలు రాశాను.. ఇంతవరకు స్పందించలేదుః ముద్రగడ

తాను ఎక్కడికీ పారిపోనని, ఇక్కడే ఉంటానని వెల్లడి

mudragada-padmanabham-responds-on-janasena-leaders-criticism

అమరావతిః జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖాస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. దీంతో జనసేన నేతలు కూడా అదే స్థాయిలో ఆయన్ను విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన ముద్రగడ.. తాను ఎక్కడికీ పారిపోనని, ఇక్కడే ఉంటానని అన్నారు. పవన్ స్పందిస్తే అప్పుడు సమాధానమిస్తానని చెప్పారు.

ఈ రోజు ఓ న్యూస్ చానల్ తో ఆయన మాట్లాడుతూ.. ‘‘జనసేనలో ఎవరో మాట్లాడితే నేను స్పందించబోను. ఇప్పటికే పవన్ కల్యాణ్‌కు రెండు లేఖలు రాశా. కానీ ఆయన ఇంతవరకు స్పందించలేదు. పవన్ స్పందిస్తే అప్పుడు సమాధానం చెప్తా. నేను ఎక్కడికీ పారిపోను. ఇక్కడే ఉంటా” అని స్పష్టం చేశారు.