పాకిస్తాన్‌లో ధోనీ అభిమాని.. ధోనీ 7 జెర్సీ

MS Dhoni Fan in pakistan with dhoni name jersey
MS Dhoni Fan in pakistan with dhoni name jersey

ఇస్లామాబాద్‌: టీమిండియా మాజీ కెప్టెన్‌, మిస్టర్‌ కూల్‌ ఎంఎస్‌ ధోనీని అభిమానించని వారు ఎవరుంటారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులున్నప్పటికీ ధోనీపై ఉండే అభిమానం కాస్త భిన్నంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే తాజా గా ఓ ఘటన అందరినీ ఆశ్చర్య పరిచేలా ఉంది. భారత్‌ పాకిస్తాన్‌ మధ్య ఎప్పుడు ఉప్పు- నిప్పు లా ఉంటుంది పరిస్థితి. అయితేనేం అది కాదు అభిమానానికి అడ్డు అన్నట్లు… పాక్‌ చెందిన ఓ ధోనీ అభిమాని ఏకంగా పాకిస్తాన్‌ జెర్సీలో ధోనీ నెంబరు. 7 ఉన్న జెర్సీని ధరించి మ్యాచ్‌ చూడడానికి వచ్చాడు. అయితే అది ఎక్కడో జరగలేదు… పాకిస్తాన్‌లో జరిగే పాకిస్తాన్‌ ప్రీమియర్‌ లీగ్‌(పిఎస్‌ఎల్‌)లో జరిగింది. స్వయంగా అతనే తన ట్విట్టర్‌ ద్వారా ఈ విషయాన్ని ప్రపంచంతో పంచుకున్నాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/