ఐపిఎల్‌పై నేడే తుది నిర్ణయం!!

లాక్‌డౌన్‌ పొడగింపు వార్తల నేపథ్యంలో ఐపిఎల్‌ నిర్వహణపై అనుమానాలు

ipl 2020
ipl 2020

ముంబయి: దేశంలో లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడుతు వస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపిఎల్‌) జరుగుతుందా? లేదా రద్దు అవుతుందా? అనేది నేడు తెలిసే అవకాశం కనిపిస్తుంది. లాక్‌డౌన్‌ పొడగించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తుండగా.. దీనిపై ప్రధాని మోదీ నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంలో లాక్‌డౌన్‌పై స్ఫష్టత వచ్చే అవకాశం ఉంది. ఐపిఎల్‌ గురించి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన బోర్డు ప్రెసిడెంట్‌ నేడు అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది.తాజాగా బిసిసిఐ బేరర్లతో మాట్లాడిన తర్వాత స్పష్టతనిస్తా అంటూ గంగూలీ.. నిజాయితిగా చెప్పాలంటే ప్రస్తుతం ప్రపంచంలో జనజీవనం అంతా స్తంభించిపోయింది. ఈ సమయంలో ఆటలకు ఎక్కడ చోటు ఉంది అంటూ పేర్కోన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఐపిఎల్‌ రద్దు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/