ముంబై లో ఫస్ట్ ఓమిక్రాన్ మరణం

భారత్ లో మళ్లీ కరోనా కేసులు భారీగా పెరగడం మొదలయ్యాయి. కేవలం కరోనా మాత్రమే కాదు ఓమిక్రాన్ కేసులు సైతం పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో దేశంలో 16,764 కేసులు వెలుగుచూశాయి. మరో 220 మంది ప్రాణాలు కోల్పోయారు. 7,585 మంది కోలుకున్నారు. మరోవైపు, ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,270కి చేరింది. ఈ తరుణంలో ముంబై లో మొదటి ఓమిక్రాన్ మరణం నమోదు అయ్యింది. 52 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ సోకింది. దీంతో అతడు గుండెపోటు రావడంతో చనిపోయాడు. డిసెంబర్ 28న అతను మరణించినట్లు వైద్య అధికారులు ప్రకటించారు. నైజీరియా నుంచి తిరిగి వచ్చిన అతను పింప్రీ చించ్‌వాడ్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని యశ్వంత్ చవాన్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఆ వ్యక్తి 13 సంవత్సరాలుగా మధుమేహంతో బాధపడుతున్నట్లు అధికారులు బులెటిన్​లో తెలిపారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ కాని కారణాల వల్ల జరిగిన మరణంగానే పరిగణించింది.

నిన్న ఒక్క రోజే.. ముంబైలో 190 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ముంబైకు చెందిన 141 మందికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వీరికి ఎలాంటి ట్రావెల హిస్టరీ లేదు. మొత్తం 153 మందికి ఒమిక్రాన్ సోకితే.. అందులో కేవలం 12 మంది మాత్రమే విదేశాల నుంచి వచ్చినట్లు గుర్తించారు అధికారులు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 198 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు ఆందోళనకర రీతిలో నమోదవుతున్నాయి. ఒక్కరోజే 18 లక్షలకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. 6,827 మంది ప్రాణాలు కోల్పోయారు. అగ్రరాజ్యం అమెరికాలో కొత్తగా 5.6లక్షల కేసులు నమోదయ్యాయి. 1,354 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 8.46లక్షలకు చేరింది. బ్రిటన్​లోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా లక్షా 89 వేల కేసులు నమోదయ్యాయి. 332 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగానే కేసుల సంఖ్య పెరుగుతోందని అధికారులు తెలిపారు.