పెళ్లి పీటలు ఎక్కబోతున్న ‘భీమ్లా నాయక్‌’ బ్యూటీ

ఇటీవల సినీ స్టార్స్ అంత పెళ్లి పీటలు ఎక్కిస్తున్నారు. కొంతమంది ప్రేమ వివాహం చేసుకుంటుంటే..మరికొద్ది మంది పెద్దలు కుదుర్చిన పెళ్లి చేసుకొని ఓ ఇంటివారు అవుతున్నారు. నయనతార , మంజిమా మోహన్‌, అధితి శంకర్‌, హన్సిక వంటి తారలు పెళ్ళి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టగా..తాజాగా భీమ్లా నాయక్ ఫేమ్ మౌనికా రెడ్డి పెళ్లి చేసుకోబోతుంది.

‘సూర్య’ వెబ్‌సిరీస్‌తో మంచి గుర్తింపు అందుకున్న మౌనికా రెడ్డి..ఆ తర్వాత ఈమెకు వరుసగా వెబ్‌సిరీస్‌లలో ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలో త్రివిక్రమ్‌ ‘భీమ్లానాయక్‌’లో లేడీ కానిస్టేబుల్ పాత్ర కోసం ఈమెను ఎంపిక చేశాడు. పవన్‌ సినిమాలో నటించడంతో ఈమె పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోయింది. ఇక ఇటీవలే రిలీజైన ‘ఓరి దేవుడా’ సినిమాలో కూడా మంచి పాత్ర పోషించింది. కాగా తాజాగా ఈమె పెళ్లి పీఠలెక్కేందుకు సిద్ధమవుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. కాబోయే భర్తతో దిగిన ఎంగేజ్‌మెంట్‌ ఫోటోను పోస్ట్ చేసింది. అయితే అతని వివరాలు మాత్రం వెల్లడించలేదు. మౌనికా రెడ్డి పెళ్లి 17,18లో గోవాలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ జరుగనున్నట్లు తెలుస్తుంది.