బాలయ్య బర్త్ డే గిఫ్ట్ : NBK107 ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్

రేపు (జూన్ 10) నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్బంగా నందమూరి అభిమానులకు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు NBK107 మేకర్స్. ఈ చిత్రం తాలూకా ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేసి అభిమానుల్లో పూనకాలు తెప్పించారు. అఖండ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలకృష్ణ..ప్రస్తుతం క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తన 107 వ సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీస్ సంస్థ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో బాల‌య్య‌కు జోడీగా శృతి హాస‌న్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ తాలూక ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకోగా…తాజాగా బర్త్ డే కానుకగా ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేసి సినిమా ఫై మరింత అంచనాలు పెంచారు.

టీజర్ లో బాలకృష్ణ ఇష్టదైవం లక్ష్మీ నరసింహా స్వామి చూపిస్తూ టీజర్ ను స్టార్ట్ చేశారు. నోటిలో సిగార్‌తో నల్ల షర్టుతో బాలయ్య లుక్ అదిరిపోయింది. ఈ సినిమాలో ఓ ఊరి పెద్ద పాత్రలో నటించారు. మరోసారి మైనింగ్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు ఈ టీజర్‌ చూస్తే అర్ధమవుతుంది. మొత్తంగా వరుసగా జీపులు ఒకదాని వెంట ఒకటి వెళ్లే సీన్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. “భయం నా బయోడేటాలోనే లేదు బోసుడీకే.. నరకడం మొదలు పెడితే.. ఏ పార్ట్ ఏదో మీకు పెళ్లాలకు కూడా తెలియదు నా కొడక్కల్లారా” వంటి డైలాగులు బాలయ్య అభిమానుల్లో పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. ఓవరాల్ గా అఖండ తర్వాత బాలయ్య ను ఎలాగైతే చూడాలనుకుంటున్నారో ..గోపీచంద్ అలాగే బాలయ్య ను చూపించబోతున్నట్లు టీజర్ చూస్తే అర్ధం అవుతుంది. మరి మీరు కూడా ఈ టీజర్ ఫై లుక్ వెయ్యండి.

YouTube video