శివపార్వతి థియేటర్ ప్రమాదం ఫై హీరో నాని ట్వీట్

ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్ కూకట్ పల్లిలోని శివపార్వతి థియేటర్ అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం పట్ల హీరో నాని ట్వీట్ చేస్తూ..థియేటర్ కు తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆదివారం సెకండ్ షో పూర్తయిన తర్వాత షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం లో థియేటర్స్ మొత్తం బూడిదైంది. ఈ ప్రమాద వార్త తెలియగానే అగ్ని మాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తీసుకున్నప్పటికీ..థియేటర్ మొత్తం కాలిపోయింది.

ఈ ప్రమాదం జరగడం బాధాకరమన్న నాన్ని…. ఆ థియేటర్​తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ట్వీట్ చేశారు. శివపార్వతి థియేటర్​లో మహేశ్ బాబు నటించిన టక్కరి దొంగ చిత్రాన్ని తొలిరోజు పిచ్చిపిచ్చిగా చూశామని గుర్తుచేసుకున్న నాని… ఈ రోజు ఆ థియేటర్ అగ్నికి ఆహుతి కావడం బాధ కలిగించిందన్నారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం కలగకపోవడం పట్ల ఊపిరిపిల్చుకున్నట్లు తెలిపారు.

తన తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్ మంచి కలెక్షన్లతో ఆ థియేటర్​లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. రోజుకు సుమారు 4 లక్షల కలెక్షన్లు వస్తున్న క్రమంలో అగ్నిప్రమాదంలో థియేటర్ బుగ్గిపాలు కావడం దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు నాని.