నాంపల్లి క్యాన్సర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

Fire accident in hyderabad
Fire accident in hyderabad

హైదరాబాద్‌: నాంపల్లిలోని క్యాన్సర్ ఆసుపత్రిలో ఈరోజు అగ్నిప్రమాదం సంభవించింది. బ్లెడ్ బ్యాంకులో ఉన్న ఏసీలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. దీంతో సమాచారం అందిన వెంటనే అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకుని రెండు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. కాగా మంటలు అదుపులోకి రావడంతో రోగులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/