చరణ్ మూవీ లో మోహన్ లాల్..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – సంచలన డైరెక్షర్ శంకర్ కలయికలో ఓ భారీ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో ఓ ప్రత్యేక పాత్రలో మలయాళ నటుడు మోహన్ లాల్ నటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా సెకండాఫ్ లో ఆయన పాత్ర ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు. శంకర్ డిఫరెంట్ గా .. పవర్ఫుల్ గా డిజైన్ చేసిన ఈ పాత్ర కోసం మోహన్ లాల్ కి భారీ రెమ్యూనరేషనే ఇస్తున్నట్లు ఫిలిం నగర్ లో మాట్లాడుకుంటున్నారు.

ఇక ఈ మూవీ లో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. విలేజ్ నేపథ్యంలో నడిచే పాత్ర ఒకటైతే, సిటీ నేపథ్యంలో స్టైలీష్ గా కనిపించే పాత్ర మరొకటి. ఈ రెండు పాత్రల మధ్య వైవిధ్యం ఈ సినిమాకి హైలైట్ అంటున్నారు. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో శ్రీకాంత్ .. సునీల్ .. అంజలి ముఖ్యమైన పాత్రలలో నటిస్తుండగా..కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.